Thursday, 23 July 2026

Neeve Maaku Dikku | Annamayya Keerthana | Telugu Lyrics

Sankeerthana : Neeve Maaku Dikku

Thala : Aadi


నీవే మాకు దిక్కు నిన్నే తలతుము

కావు మా నేరమెంచక కరుణానిధీ


నెట్టన సూర్యునిలో నెలకొన్న తేజమా

గట్టిగా చంద్రునిలోని కాంతిపుంజమా

పుట్టిరక్షించే యజ్ఞపురుషుని ప్రకాశమా

వొట్టుక దేవతలలోనుండిన శక్తీ    


సిరులుమించిన యట్టిజీవులలో ప్రాణమా

గరిమ వేదములలో గల యర్థమా

పరమపదమునందు పాదుకొన్న బ్రహ్మమా

చరాచరములలో సర్వాధారమా


జగములో వెలసేటిసంసారసుఖమా

నిగిడినమంత్రముల నిజమహిమా

మిగుల శ్రీవేంకటాద్రిమీదనున్నదైవమా

ముగురువేల్పులలోని మూలకందమా

No comments:

Post a Comment