Annamacharya Sankeerthana
Music Composed and Sung by G.Bala Krishna Prasad
Raagam : Reethigoula
Thaalam : Aadi
గరుడాద్రి వేదాద్రి కలిమి యీపె
సిరులొసగీ చూడరో చింతామణి యీపె
పాల జలధి పుట్టిన పద్మాలయ యీపె
లాలిత శ్రీ నారసింహు లక్ష్మి యీపె
మేలిమి లోకమాతయై మించిన మగువ యీపె
యీ లీల లోకములేలే యిందిర యీపె
ఘన సంపద లొసగు కమలాకాంత యీపె
మనసిజు గనిన రమాసతి యీపె
అనిశము పాయని మహా హరి ప్రియ యీపె
ధన ధాన్య రూపపు శ్రీ తరుణి యీపె
రచ్చల వెలసినట్టి రమా వనిత యీపె
మచ్చిక గల అలమేల్మంగ యీపె
యిచ్చటి వేంకటాద్రిని అహోబలమునందు
నిచ్చలూ తావుకొనిన నిధానము యీపె
No comments:
Post a Comment