Monday, 5 September 2011

Lyrics Of Angana Leere Aarathulu - Annamacharya Keerthana in Telugu

అంగనలీరే హారతులు 
అంగజగురునకు హారతులు

శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే 
ఆదిమ పురుషునకు కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి 
ఆదిత్య తేజునకు హారతులు

సురలకు అమృతము సొరది నొసంగిన 
హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల 
నడచిన అరి భయంకరునకు హారతులు

నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి 
అచ్యుతునకు నివె యారతులు 
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ 
అచ్చుగ నిలిచిరి యారతులు

 Pallavi:

angana leere aratulu
angaja gurunaku naratulu
Charanam1:
sridevi toduta chelaguchu navve
adima purushuni karatulu
medinee ramani melamu ladeti
aditya tejuna karatulu

Charanam2:

suralaku namrutamu soradi nosangina
harikidivo pasidaratulu
taramidi dushtula danujula nadachina
aribhayankaruna karatulu

Charanam3:

nichhalu kalyana nidhiyai yegeti
achyuthunaku nive aarathulu
chochhi srivenkatesudu nalamelmanga
yachhuga nilichiri yarathulu

No comments:

Post a Comment